Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, May 7, 2013

1 పేతురు 1వ అధ్యాయము

1-2. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును,యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును  ఏర్పరచబడినవారికి, అనగా పొంతు, గలతీయ,కప్పదొకియ, ఆసియ, బితునియ అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక.
3. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక.
4. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను.
5. కడవరి  కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసముద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.
6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి  నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెముకాలము మీకు దు:ఖము కలుగుచున్నది.
7. నశించిపొవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
8. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు;
9. ఇప్పుడు ఆయనను కన్నులార చూడకయే విశ్వసించుచు, మీ విశ్వాసమునకు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు,చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషముగలవారై ఆనందించుచున్నారు.
10-11. మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు  ఈ రక్షణను గూర్చి  పరిశీలించుచు, తమయందున్న
క్రీస్తు ఆత్మ  క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా  సాక్ష్యమిచ్చునప్పుడు,ఆ ఆత్మ, యే కాలమును ఎట్టి కాలమును సూచించుచూవచ్చెనో  దానిని విచారించి పరిశోధించిరి.
12. పరలోకమునుండి పంపబడిన పరిశుద్ధాత్మవలన  మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు
తెలుపబడిన యీ సంగతులవిషయమై, తమకొరకు  కాదు గాని మీకొరకే తాము పరిచర్య  చేసిరను సంగతి  వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ  కార్యములను తొంగిచూడగోరుచున్నారు.
13. కాబట్టి  మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ది గలవారై,యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నీరీక్షణ కలిగియుండుడి.
14-16. నేను పరిశుద్ధుడనై  యున్నాను గనుక మీరును పరిశుద్దులై యుండుడని వ్రాయబడియున్నది. కాగ మీరు విధేయులగు పిల్లలై,మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,మిమ్మును పిలచినవాడు పరిశుద్ధుడై యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
17. పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రియని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంత కాలము భయముతో గడుపుడి. 
18. పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని
19. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా
20-21. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి. 
22-23. మీరు క్షయబీజము నుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. 
24. ఏలయనగా -సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును. 
మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే.         
    Download Audio File           

No comments:

Post a Comment